Saturday, April 11, 2020

లహరి మణిపూసలు

"లహరి" మణిపూసలు
పొట్టోల్ల లహరి 
9వ తరగతి
ZPHS గుఱ్ఱాలగొంది
జిల్లా సిద్దిపేట


గురువు : శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు
ZPHS గుఱ్ఱాలగొంది
జిల్లా సిద్దిపేట

వివిధ మణిపూసలు
1.
నల్ల బల్లను చూసింది
చెల్లీ బాగ రాసింది
రాత గుండ్రంగున్నదని 
టీచరెంతో మెచ్చింది
2.
ఆపిలు పండు తిన్నాను
ఎంతో తియ్యగుండేను
బలము నాకు కలిగింది
ఆటలు బాగా ఆడాను
3
రెక్కల ఫ్యాను మాకుంది
గిర్రు గిర్రున తిరిగింది
చల్లని గాలి మాకిచ్చి
దోమలనన్ని తరిమింది
4
తరగతి గది నుండగ
అక్క పిలిచెను గట్టిగ
అదిచూసి సారు మమ్ముల
బెదిరించెను వేగముగ
5
జనులు జాతర కొచ్చారు
పుల్లూర్ బండ ఎక్కారు
బొమ్మ లన్ని కొనుక్కుని
తిరిగి ఇంటికి వెళ్ళారు
6
హోళీ పండుగ వచ్చెను
రంగుల నెన్నో తెచ్చెను
రంగులను పోసుకున్న
మాకు ఆనంద మాయెను


7
శ్రీ జయశంకరు సారు
ఆగస్టున పుట్టారు
చదువు కోసము సారు
పట్టణాల కెళ్ళారు
8
శ్రీ జయశంకరు గారు
గొప్ప ప్రొఫేసరు గారు
అలిగఢ్ యూనివర్సిటి
పీ.జి. పూర్తి చేశారు
9
శ్రీ జయశంకరు సారు 
తెలంగాణ కోరారు
ఉద్యమాలు చేసుకుంటు
చివరి శ్వాస విడిచారు
10
తెలంగాణ తిరిగారు
జనులు నొకటి  చేశారు
తెలంగాణ వచ్చినంక
చూడలేక పోయారు


బతుకమ్మ మణిపూసలు
11
బతుకమ్మ వచ్చేను
సంబరాలు తెచ్చెను
చిన్న పెద్దలంత కలిసి
గౌరి పూజచేసెను
12
వేకువనే లేచాము
అడవిలోకి వెళ్ళాము
పువ్వునంత తీసుకొచ్చి
వేరు చేసి పెడతాము
13
అందరము చేరుతాం
పువ్వంత తెంపుతాం
కట్టలేన్నొ కట్టియు
బతుకమ్మ పేర్చుతాం
14
వాడలందు నిలుపుదాం
పాటలెన్నొ పాడుదాం
పాడినంక తీసుకొని
చెరువులోన వేయుదాం
15
వయనాలను పంచాము
ఫలహారము తిన్నాము
పాటలెన్నొ పాడుకుంటు
పరవశించి పోయాము

సావిత్రి బాయి పూలె
16
సావిత్రీబాయి గారు
నైగావ్ లో  పుట్టినారు
పాటిల్ గారి ఇంటిలో
పెద్ద కూతురు అయ్యారు
17
అమ్మనాన్నలు కలిశారు
ఆమెకు పెళ్లి చేశారు
ఆమె బయట కెళ్ళకుండ
ఇంటిలోన ఉంచెవారు
18
సావిత్రిబాయి గారు
సేఠ్ జి దగ్గరి కెళ్ళారు
అతడు రోజు సావిత్రికి
కథలు చెప్పు తుండెవారు
19
సేఠ్ జి  గారు ఆమెను
చదువు చదివి పించెను
స్త్రీలకేమొ బడి పెట్టి
పంతులమ్మ చేసెను

వివిధ మణిపూసలు
20
ప్లేగు వ్యాధి సోకింది
ఆమె చచ్చిపోయింది
ఇలా ఆమె జీవితం
చివరి దాక గడిపింది.
21
కోడి గుడ్డు పెట్టింది
అక్క వెళ్లి తెచ్చింది
అమ్మ చేతి కివ్వగను
అట్లు పోసి ఇచ్చింది
22
పొద్దున నేను లేచాను
చకచక పనులు చేశాను
స్నేహితులతో కలిశాను
పాఠశాలకు వెళ్లాను
23
మట్టి గాజులుకొన్నాను
చేతికి వేసుకున్నాను
గళ్ళుగళ్ళు మంటుంటె
మనసే పులకరించేను
24
చీపురుకట్ట పట్టాను
ఇల్లునంతను దులిపాను
బల్లి వచ్చి పడగానె
చాలా భయము వేసింది
25
మాకు ఉండెను కుక్క
దాని పేరు తిమ్మక్క
చెప్పినట్టు వింట దక్క
దానికి ఇష్టం బొక్క
26
బంతి తోటి ఆడాను
దెబ్బ నాకు తగిలేను
అమ్మ నన్ను తిట్టియు
మందులెన్నో వేసెను
 27
చెట్టు మీద ఉండె పిట్ట
కూకూ యని అరిచె పిట్ట
అది ఎంతో మంచిదంట
నన్ను నిద్ర లేపె కొట్ట!
28
వార్తలన్ని చూశాను
విషయాలెన్నొ తెలిసెను
సారు ప్రశ్నలడిగినపుడు
జవాబులను చెప్పాను
29
కొత్త బ్యాగును కొన్నాను
పుస్తకాలను పెట్టాను
బడికి తీసుకు వెళ్ళాక
జాగ్రత్తగానె చూసాను
30
శివరాత్రియు వచ్చింది
జాగారం తెచ్చింది
కందగడ్డ ఉడకబెట్టి
మాకందరికిచ్చింది
31
అమ్మకు జ్వరము వచ్చింది
ఆసుపత్రికి వెళ్ళింది
ఆసుపత్రిలో డాక్టరమ్మ
మలేరియా జ్వరమన్నది
32
మైదాకంత తెంపాను
రోట్లెవేసియు దంచాను
మెత్తని ముద్ద కాగానె
చేతులనిండ పెట్టాను
33
నల్లా నీరు వస్తుంది
అమ్మ మోటార్ పెట్టింది
తిరిగి నీళ్లు పోయాక
దానిని బంధు చేసింది
34
చెల్లె  సినిమా చూస్తుంది
అందున దయ్యం వచ్చింది
భయమేస్తుందని అనగా
అక్కఛానలుమార్చింది.
35
అల్లారం పెట్టాను
మోగ గానె లేచాను
పుస్తకము పట్టుకొని
పాఠాలను చదివాను.
36
కోమటి చెరువు వెళ్ళాము
రోపువేను ఎక్కినాము
పడవలో షికారు జేసి
బొమ్మలు చాల కొన్నాము
37
కొత్త చెప్పులు కొన్నాను
గుమ్మము ముందువిడిచాను
కుక్కలు వచ్చి వాటిని
నోటకరచుక వెళ్ళాయి
38
పొలము దగ్గర కెళ్ళాము
అందు మొలకను చల్లాము
పెరిగి పెద్దయ్యాక
నాట్లను వేసి వచ్చాము
39
ఇల్లును మేము కట్టాము
తెల్లని రంగు వేశాము
రంగు పైన మరో రంగు
పచ్చని రంగు వేశాము
40
చలి బాగా పెడుతుంది
అక్క స్వెటర్ వేసింది
మంట కాడ కూర్చొని
అందు చేయి పెట్టింది
 41
చేయిబాగా కాలింది
ఆసుపత్రికి వెళ్ళింది
మందు పూసి నరసమ్మ
పట్టిని వేసి పంపింది
42
హైదరాబాద్ పోయాను
రంగులరాట్న మెక్కాను
బుర్ర గిర్రున తిరిగింది
చెక్క రొచ్చియు పడ్డాను
43
వాకిలి సాన్పు చల్లాము
సంక్రాంతి రథమేశాము
ఎరుపు,పచ్చ గులాబి
రంగు దాంట్లో అద్దాము
44
గబ్బిలమునే చూశాను
తలక్రిందులు వేలాడెను
రాత్రి ఇంట్లో చేరంగ
అందరికి భయమేసేను
45
కొత్తబట్టలు కట్టాను
ఫోటో షాపుకు పోయాను
పాసుపోర్టు దిగివచ్చి
హెచ్.యం.గారికిచ్చాను
46
పచ్చి కర్రతొ కొట్టొద్దు
కరెంటు వైరు తాగొద్దు
షాకుకొడితే ప్రమాదము
దానిచెంతను ఆడొద్దు
47
వర్షాకాల మొచ్చెను
వాడంత బురుదాయెను
ఆటలాడ బురద పడగ
అమ్మ చెవులను పిండెను
48
దుకాణానికి వెళ్లాను
కురుకురేలను కొన్నాను
కల్తి నూనె కలిసెనేమొ
వాంతులే ఎక్కువాయెను
49
కొత్త బట్టలు వేసాను
బయటికి వెళ్లి వచ్చాను
దిష్టి తగిలిందని అమ్మ
ఉప్పే పొయ్యిల వేసెను
50
నాన్న దుక్కి దున్నినాడు
ఉల్లి తౌటం చేశాడు
ఉల్లి ధర బాగుందని
పెంచి పెద్ద జేసినాడు


సైనికుడు
51
సరిహద్దులుంటరువీరు
సైనికులే వీరి పేరు
నిద్రాహారాలు లేని
పోరాటమెవీరి జోరు
52
పుట్టినూరు వదిలి పెట్టి
కన్నవాళ్ళ విడిచిపెట్టి
దేశసేవే ముఖ్యమని
కుటుంబాలువిడిచిపెట్టి
53
పుణ్యభూమిన జన్మించి
మనశ్శాంతిని మాకిచ్చి
శత్రుమూకల పోరాడి
విజయమే మనకందించి
54
మహానీయులై మీరు
మమ్ముల రక్షించారు
మీరు ఉంటేనే మేము
సుభిక్షంగ ఉంటాము
55
దేశ రక్షణకు మీరు
ప్రాణము లెక్కచేయరు
ముళ్ళ మీద చెలగాటం
నిత్య వాడుతుంటారు

సమ్మక్క - సారక్క
56
బంధువులంత కలిశాము
వ్యాను మాట్లాడుకున్నము
పాటలెన్నొ పాడుకుంటు
మేడారము వెళ్ళినాము
57
జంపన్న వాగెళ్ళాము
స్నాన మక్కడ చేశాము
క్యూ పద్ధతి పాటిస్తూ
సమ్మక్క దర్శించాము
58
బంగారమర్పించాము
వచ్చినోళ్ళకు పంచాము
కోట్ల భక్తులను చూస్తూ
జాతరను తిలకించాము
59
మహాభారతము వినగా
ధర్మమంటె తెలిసెనుగా
శ్రీకృష్ణ పరమాత్మ
గీత సారము చెప్పెగా
60
దొడ్డు రగ్గు మాకుంది
ఎర్ర రంగులో ఉంది
కప్పుకుని పడుకుంటే
చలియన్నది రాకుంది
61
చరవాణిని యందరు
వాడుతునే ఉన్నరు
మంచి మంచి విషయాలు
ఎన్నొ తెలుసుకున్నరు
62
పరీక్షలను రాశాను
మంచి మార్కులు వచ్చెను
అందుకు సార్లు నాకు
మెచ్చి బహుమతులిచ్చెను
63
ఆయనేగా అధినేత
ఆయనేగా జాతిపిత
స్వాతంత్రం కోసము
పోరాడిన గాంధి తాత
64
వడ్ల వారువచ్చెను
చెట్లనేము నరికెను
కొమ్మలన్ని నరికినంక
మొద్దులుగా జేసెను
65
కిటికి,తలుపులు చేశారు
వాటికి రంగులేశారు
ఎండకు ఆరపెట్టాక
ఇంటికి తీసుకొచ్చారు
66
ఇంటి కవియు పెట్టగ
ఇల్లు కంద మొచ్చెగ
గాలి వెలుతు రెక్కువ
అందు నుండి వచ్చెగ
67
శివుని గుడికిని వెళ్లాను
పూజలెన్నో చేశాను
కొబ్బరికాయ కొట్టుకొని
ప్రసాదములను పంచాను.
68
అడవిలోకి వెళ్లారు
వెదురు చెట్లు చూశారు
పేపరు బాగ వస్తుదని
ఆలోచన చేశారు
69
రంపము చేత పట్టారు
చెట్లను నరికి వేశారు
కంపెనీ తీసుకెళ్లి
మిషీనులలో వేశారు
70
ముక్కలు చేసిఇవ్వగ
మరొక మిషనుల వేయగ
గుజ్జు బయట తీశాక
పేపరు తయారవ్వగ
71
నోటు బుక్కులు చేశారు
షాపుకు తీసుకొచ్చారు
పిల్లలందరుకొన్నాక
ముద్దుగ రాత రాశారు
72
ప్రకృతిని కాపాడండి
భవిష్యత్తు మనదండి
ప్రకృతిలోని మన బతుకు 
ముడిపడినదని తెలియుడి
73
టిక్కెట్లు తీసినాను
సినిమాకు పోయినాను
దేశభక్తి గలిగిన
సినిమానే చూశాను
74
తాత పతంగి పట్టాడు
తోకను అతుకు పెట్టాడు
మాంజదారముపెట్టియు
గాలి లోనికి విడిచాడు
75
అక్కకు బాధ వేసింది
చెరువు దగ్గరి కెళ్ళింది
చంద్రుని చూసుకుంటు
కన్నీళ్లెన్నొ కార్చింది
76
అందరము కలిశాము
ముగ్గులను వేశాము
రంగులెన్నో అద్దియు
గొబ్బెమ్మ పెట్టాము
77
కోళ్ళపందెం పెట్టారు
చూచె వారును వచ్చారు
పోటిలో డబ్బు పెట్టియు
గెలిచిన వారికి ఇచ్చారు.
78
సరిహద్దు లుండే వాడు
కాపలకాసె సైనికుడు
రాత్రి నిద్ర మరచిపోయి
దేశ సేవకై నిలిచాడు
79
పిల్లలను మరిచిచావు
భార్యనే విడిచినావు
సరిహద్దుల శత్రువులను
తరిమి తరిమి కొట్టావు
80
రిపబ్లిక్ డే దినము
రాజు లేని రాజ్యము
ప్రజలచే ఎన్నుకొనిన
పాలించుటె ముఖ్యము
81
బి.ఆర్.అంబేద్కర్ గారు
రాజ్యాంగము రాసినారు
దేశదేశాలు తిరిగి
రూపకల్పన చేశారు.
82
ఊరంతా లేచిరి
సందడినే చేసిరి
వసంత పంచమనియు
దేవుని గుడికెళ్ళిరి
83
అమ్మవారిని చూసాము
దేవతనంత కడిగాము
బొట్లు మాతకు పెట్టాక
పూజకు సిద్ధ పర్చాము
84
పంతులు గారు వచ్చారు
పూజ సామాను చెప్పారు
తీసుకొచ్చి ఇచ్చాక
పూజ మొదలు పెట్టారు
85
పాటలను పాడినాము
శ్లోకాలు చదివినాము
దూప దీప నైవేద్యం
వాగ్దేవికి పెట్టినము
86
చల్లని చూపే అమ్మది
మమ్ములను దీవించినది
ధవళ వర్ణ కాంతులల్ల
ధగ ధగామెరయు చున్నది
87
పీట పై పడుకున్నాను
పీడ కలలను కన్నాను
నాకు భయం వేసింది
అమ్మ దగ్గరి కెళ్ళాను
88
మూడున్నరకు చెల్లెను
ఇంటికి తోలు కొచ్చెను
కడుపునిండ తిన్నాక
రాత పనినే చేసెను
89
కూడవెల్లి కి వెళ్ళాము
శివలింగమును మొక్కాము
జాతర తిరిగి అందరం
బొమ్మలు కొనుక్కున్నాను
90
గడియారము మాగుంది
కాలాన్నే చెపుతుంది
బడికి నీవువెళ్ళమని
గంటకొట్టి చెపుతుంది
91
ఆటో నేను ఎక్కాను
సిద్దిపేటకు పోయాను
కథలు ఎట్లు రాయాలో
నేర్చుకొనినే వచ్చాను.
92.
వేప చెట్లు పెట్టారు
వాటికి నీరు పోశారు
ఎంతో బాగా పెరిగాక
వేపకాయలు అమ్మారు.
93
పొద్దున నేను లేచాను
నెట్టు ఓపెన్ చేశాను
విషయాలను తెలుసుకుని
మణిపూసలు రాశాను
94
కార్యశాలకు వచ్చాను
బాలల నేను కలిశాను
పెన్ను బుక్కులు ఇచ్చారు
చెప్పినవన్ని రాశాను
95
విషయ నిపుణులు వచ్చారు
చిన్న కథలను చెప్పారు
బాలలందరు వినగానె
మెదడుకు పదును పెట్టారు
96
గేయము నేను రాశాను
వచన కవితలు రాశాను
పరిశీలకులు మెచ్చియు
కవిగ నీవు ఎదుగుమనెను
97
ఇంటికి నే వచ్చాను
అమ్మ నే మెచ్చుకొనెను
సర్టిఫికెట్ చూసినాది
ఎంతో మురిసిపోయెను
98
మణిపూసలు రాశాను
గురువు చెంతకొచ్చాను
గురువు నన్నుమెచ్చాక
ఇంక రాస్త నన్నాను
99
యాదాద్రికే వెళ్ళాము
గుడి లోపలికి పోయాము
దేవుడి దర్శనమవగా
బయటకు మేము వచ్చాము
100
వరుసల నిలబడ్డాము
లడ్డూలను కొన్నాము
ప్రసాదమును పంచాక
గుడి పనులను చూశాము.
101
గోధుమపిండి తెచ్చాము
పప్పును ఉడుక పెట్టాము
పాకమును పట్టినంక
పప్పు దాంట్లో పెట్టాము
102
పిండిబాగ కలిపాము
రొట్టె నేమొ చేశాము
పూర్ణమందులో పెట్టి
బక్షాన్నే చేశాము
103
కడాయిలో వేశాను
ఎంతో బాగ కాలెను
దేవుళ్లకు పెట్టినంక
ఇష్టంగా తిన్నాను
104
కారులోన ఎక్కినాము
హైదరబాదు పోయాము
మోడలు స్కూలుకి వెళ్లి
అవార్డు అందుకున్నాము


*దాహం* మణిపూసలు
105
అడవులే నశించాయి
చెరువు లెండిపోయాయి
పక్షులు జంతువులకేమొ
నీళ్లే కరువయ్యాయి
106
నాలుగు పిచ్చుకలుండెను
వాటికి దాహము వేసెను
అందులో తల్లి పిచ్చుక
నీళ్ళ కోసమని వెదికెను
107
ఊరంతా తిరిగెను
వెతికి వెతికి చూసెను
వాటికి ఒక దగ్గర
నల్లా కనిపించెను
108
తల్లి పిచ్చుక చూసింది
నల్ల పైనను కూర్చుంది
తన ఎడమ కాలితో
నల్లనేమో తిప్పింది
109
పిల్లలు నీరు త్రాగెను
వాటి దాహము తీరెను
అప్పుడు అవి గూటికి
సంతోషంగ వెళ్ళెను.


గుఱ్ఱాలగొంది మువ్వలు
110
బాలలకేమొ మా సారు
అంశాలన్ని ఇచ్చారు
వాటి మీదనే మమ్ములను
పాటలు రాయమన్నారు.
111
పిల్లలు యోచించారు
పాటలన్ని రాశారు
సారు వాటిని చూసియు
బాగున్నాయి అన్నారు.
112
పాటలన్నీటి కందరు
మంచి శీర్షిక పెట్టారు
విషయానికి తగ్గట్లు
భావననుసమ కూర్చారు
113
పాటలను జమచేశారు
పుస్తకములో వేశారు
ఫోటోలన్ని తీసుకుని
పాటల కింద వేశారు
114
కల్మషమంటనిబాలలు
మాబడిలోనీ పిల్లలు
పుస్తకానికి పేరుబెట్టె
"గుఱ్ఱాలగొంది మువ్వలు"
115.
మీటింగును పెట్టారు
డీ.ఇ.ఓ.ను పిలిచారు
వారి చేతుల మీదుగా
పుస్తకాలనిచ్చారు
116
తల్లిదండ్రులొచ్చిరి
మా పాటలు చూసిరి
మేము పాడుతుండగా
సంతోషము పొందిరి.

వివిధ మణిపూసలు
117
పాఠశాల కెళ్ళాను
టిఫిను నేను తిన్నాను
బడిలో గంట కొట్టంగ
వరుసన నిలబడ్డాను
118
గోల్కొండకు పోయాము
ఫోటోలెన్నొ దిగాము
సంతోషంగ తిరిగాక
వెళ్లి కారు ఎక్కాము
119
అడవికి మేము వెళ్ళాము
పచ్చచిగురునుచూశాము
ప్రకృతి దృశ్యాలు జూస్తు
సంతోషంగ గడిపాము
120
జారు బండ ఎక్కుదాం
జర్రు జర్రు జారుదాం
బుద్ది ధీర దాకజారి
ఉయ్యాలలు ఊగుదాం
121
పతంగులను కొన్నాము
తోక నతుక పెట్టాము
దారమును కట్టినంక
పైకి నెగుర వేశాము
122
మాకు ఉండెను కుక్క
దాని కిష్టము బొక్క
తింటే గాని దానికి
నిద్ర పట్టదె అక్క
123
ఖోఖో ఆట ఆడాము
అందరినౌటుచేశాము
మేము ఆటలో గెలువంగ
బహుమతి అందుకున్నాము


గణపతి, మూషికాల స్నేహం
124.
గణపతి ఎలుకలు కలిసెను
చెట్టు కిందికి వెళ్ళేను
గంప నిండా లడ్డూలు
వెంటను తీసుకవెళ్లెను
125
ఎలుకలన్నికలిసెను
తాడు వెతికి తెచ్చెను
చెట్టుకొమ్మకు తాడుతో
ఊయలాను గట్టెను
126
గణపతికూర్చుండెను
ఎలుకలూయ లూపెను
దేవునికి లడ్డూలు
ఘనముగ అందించెను
127
గణపతి లడ్డూలను
కడుపునిండా తినెను
సంతోషంగ ఆడుకొని
ఇంటికెవెళ్ళి పోయెను
128.
స్నేహానికి గుర్తుగా
సేవచేసే గొప్పగా
గణపతి వాటి సేవకు
పొంగిపోయె నిండుగా

కరోనా వైరస్ మణిపూసలు
129
కరోన వైరసు వచ్చెను
మృతుల సంఖ్యయే హెచ్చెను
జగమంత హడలిపోతు
భయముతో వణుకుచుండెను
130
చేతులు కడుక్కోవాలి
మాస్క్ లను  ధరించాలి
కరోన పోవాలంటే
జాగ్రత్తలు వహించాలి
131
చైనాలో పుట్టింది
కరోనగా మారింది
కనబడి నోళందర్ని
వెంటబడి తరుముతుంది
132
వేల మందిని చంపింది
పరదేశాల కెళ్ళింది
పరుగు పరుగున జనముపై
విజృంభిస్తూ వచ్చింది.
133
మందులు మాకులు లేవండి
నివారణే ముఖ్యమండి
కలిసికట్టుగా ఉంటెను
కరోనమాయమౌనండి
134
షేకు హ్యాండులు ఇవ్వద్దు
మందిల బాగా తిరుగొద్దు
ఇంట్లో క్షేమంగుండాలి
వీధి లెప్పుడు తిరగొద్దు


జలసంరక్షణ
135
చెట్లేమొ లేకపాయె
వర్షాలే కరువాయె
ఇవి రెండు లేకపోతె
నీళ్ళే దొరకవాయె
136
అడవులను పెంచాలి
వర్షాలుకురువాలి
నీటి కొరత లేకుండా
మనమంత బతుకాలి
137
నీళ్లు మంచి గుంటేను
పంట బాగ పండేను
కరువులన్ని తీరిపోగ
ఆహారము దొరుకును
138
పొదుపుగనీరు వాడాలి
వచ్చె తరము బతకాలి
నీటి పొదుపు గూర్చి
విషయాలు తెలుసుకోవాలి
139
జనమంతయుమేలుకొండి
చెట్లు సంరక్షించండి
భూగర్భజలమెపుడు
విస్తారము లభించండి.
140
గడ్డ పారను పట్టాలి
ఇంకుడుగుంత తవ్వాలి
అందునా నీరు నిల్చిన
భూమిన నీరు పెరంగును

నాట్లు-మహిళ
141
రైతు ఊరికి వెళ్తాడు
ఇంటింటికి తిరుగుతాడు
కూలీల పిలుచుకవచ్చి
పొలము దగ్గరికెళ్తాడు
142
కూలీ లంత వస్తారు
పొలములోనను దిగుతారు
కొంగు నడుముకు చుట్టు కొని
వరి నారునే తీస్తారు
143
రైతులు నారు ఇస్తారు
మహిళలు నాటు వేస్తారు
పాటలెన్నొ పాడుకుంటు
పరవశించియు పోతారు
144
వంచిన నడుము ఎత్తరు
నాల్గు రిక్కలు పడుతరు
మునుము పట్టు కుంటను
పొలము లోన నాటెదరు
145
పొద్దు గూట్లె పడుతది
కూలి చేతికొస్తది
సంబురంగ ఇంటికి
మహిళ  చేరుకుంటది

ఉగాది పండుగ మణిపూసలు
146
వికారి వెళ్ళిపోయింది
శార్వరి మనకు వచ్చింది
పండుగ నేమొ లేకుండ
 కరోన వచ్చి చేరింది
147
కోకిలమ్మ కూత లేదు
మావి చెట్టు కాత లేదు
పండుగను కరోనా
జరుపుకో నివ్వనెలేదు
148
లాకు డౌను చేసినారు
ఇంట్లో ఉండమన్నారు
ఇంట్ల ఉన్న వస్తువులతొ
ఉగాదిజరుప మన్నారు
149
దేవుడికి మొక్కినాము
టెంకాయలు కొట్టినము
పచ్చడిని తాగినంక
భక్ష్యాలను తిన్నాము
150
మాస్కులను ధరించినము
ఇంటిలోనే యున్నాము
టీవీ వార్తలనుజూస్తు
జాగ్రత్తగ ఉన్నాము.


మక్క  కంకులపై మణిపూస లు
151
మక్క చేనుకు పోయాము
మక్క కంకులు విరిశాము
విరిచి వాటి నన్నిటిని
సంచులల్లో నింపాడు
152
ఇంటికి తీసుకొచ్చాము
వాటి బూరును తీశాము
పొయ్యిల మంట మండించి
కంకులు కాల్చు కున్నాము
153
పొయ్యిల నుండి తీశాము
నిమ్మ, ఉప్పు రాశాము
నోట్లొ ఊరిల్లు ఊరగ
కడుపు నిండా తిన్నాము
154
కూలీలను పిలిచాము
చేనునంత కోశాము
బండమీద ఎండబోసి
బూరు నంతా తీశాము
155
కంకులమిషను వచ్చింది
కంకుల నన్ని పట్టింది
బస్తాలల్లో నింపాక
జోరున వాన కురిసింది
156
ఎండకు ఎండ బెట్టాము
ట్రాక్టరు తీసు కొచ్చాము
సిద్దిపేటకు తీసుక వెళ్ళి
అమ్మి డబ్బులు తెచ్చాము


పాప ఊయల మణిపూసలు
157.
అమ్మ మేలు కొన్నది
పనులు చేస్తు ఉన్నది
అమ్మ తోటి పాప లేచి
ఆడుకుంటు ఉన్నది
158
పాలబువ్వ కలిపింది
పాపకుతిన పెట్టింది
కడుపునిండ తిన్నాక
పాపకు నిద్ర వచ్చింది
159
అమ్మ చీర తెచ్చింది
దూలానికి కట్టింది
పాప నందులో వేయగ
గాఢ నిద్ర పోయింది
160
అమ్మ పనికి వెళ్ళింది
వరి కోత కోసింది
మధ్యాహ్నం వచ్చియు
పాప కన్నం పెట్టింది
161
తిరిగి పనికి పోయింది
కుప్పలన్ని మోసింది
కళ్ళంల పెట్టి వచ్చి
రాత్రి ఇంటికొచ్చింది
162
అన్నము కూర వండింది
అందరికినే పెట్టింది
పాపకు పాలు పట్టి
తాను నిద్రను పోయింది.


కరోనా జాగ్రత్తలు మణిపూసలు
163
ఊరందరును కలిశారు
ఐకమత్యము చాటారు
కరోనాను తరిమి కొట్ట
జాగ్రత్తలు వహించారు
164
ఇంటి బయటకెళ్ళము
ఇంటిలోనే ఉంటము
లాకుడౌను అందరును
పాటించి తీరుతాము
165
ఇంటి బయటకందరము
గుంపులుగాను వెళ్ళము
చిన్న చిన్న పనులుంటె
ఒక్కొక్కరు వెళ్ళెదము
166
సర్పంచును కలిసారు
మీటింగును పెట్టారు
కొత్త వారినెవ్వరిని
ఊరికి వద్దన్నారు
167
బస్సులు రావట్లేదు
జనులే పోవట్లేదు
కష్టమెంత ఐనను
పనులే ఆగుటలేదు


దేవుళ్ళ పై మణిపూసలు
168
ముక్కంటి దేవుడివా
త్రిశూలమును బట్టవా
దానితోటి  కరోనాను
పోయెటట్టు చూడవా
169
వెంకటేశ్వర స్వామి
నీ కొండకు వస్తిమి
అందరిని కరోన నుండి
కాపాడయ్య స్వామి
170
బృందావన కృష్ణయ్య
మమ్ముల కాపాడయ్య
మహమ్మారి కరోనతో
మరణాలు ఎక్కువయ్య
171
అయోధ్యా రాముడతడు
ప్రజలందరికి దేవుడు
చేతిలోని బాణముచే
కరోనను చంపుతాడు
172
దేవుళ్ళంత వస్తరు
కరోనా పని పడతరు
దేశమంత క్షేమంగ
ఉండేటట్లు చేస్తరు


బాలకార్మికుల కష్టాలు
173
అమ్మ నాన్న ఉన్నారు
పనికి వెళ్ళుతున్నారు
కూడు సరిపోదని
పిల్లలు వెళ్ళు చున్నరు
174
ఇటుక బట్టి వెళ్తున్నరు
ఇటుకలను మోస్తున్నారు
వచ్చేటి డబ్బుతో
జీవనము గడుపుతున్నరు
175
పాప ఇటుకలుమోసెను
శక్తి అంతాతగ్గెను
ఆహారమెంతతిన్న
ఎదుగ లేకపోయెను
176
బడులకు పంపించాలి
పిల్లల చదివించాలి
పనులకు వెళ్ళకుండా
ప్రజలే గుర్తించాలి
177
బాల్య మందు బాలలు
ఆడవలెను ఆటలు
రెక్కబొక్కముదురాలి
బడికి పంపించాలి
178
పెద్దలు పనికి పోవాలి
డబ్బు సంపాదించాలి
కన్న పిల్లలందరినీ
ఆరోగ్యంగ ఉంచాలి
179
బడికి వచ్చె పిల్లలు
వికసించిన మల్లెలు
ప్రభుత్వం పిల్లలకు
ఇవ్వవలెను బుక్కులు
180
పనికి తీసుకు వెళ్ళొద్దు
జైలుపాలును కావద్దు
చిన్నపిల్లలందరిని
ఇంటివద్దే నుంచొద్దు
181
అంగను వాడి తోలాలి
గుడ్లు పాలను ఇవ్వాలి
కమ్మని కథలు నేర్పాక
చిన్న బడికిని పోవాలి

ఋషి తపస్సు మణిపూస లు
182
రుషి ధ్యానము చేస్తున్నడు
రాజు అక్కడికొచ్చాడు
నాకు దాహ వేస్తోందని
నీళ్లివ్వుమని యడిగాడు
183
రుషి నీళ్లను ఇవ్వలేదు
మాట పలుకు అసలు లేదు
ఇంత పొగరుబోతుయని
రాజు కేమొ తెలియలేదు
184
అక్క డిక్కడచూచెను
చచ్చిపోయిన పామును
తీసుకు వచ్చి రాజేమొ
ముని మెడలోన వేసిను
185
ఋషి కొడుకే వచ్చాడు
తన తండ్రిని చూశాడు
తండ్రి మెడలో పామున్నది
ఎక్కడిదని యడిగాడు
186
అపుడు శిష్యులందరు
కథ నంత చెప్పారు
ఉగ్రుడైన కొడుకేమొ
రాజును శపిస్తారు.


కష్టించే రైతు మణిపూస లు
187.
ఎద్దులాను తెచ్చాడు
నాగలికి కట్టాడు
పొలము అంతా దున్ని
నాట్లేయ దలిచాడు
188
పొలము నాట్లు వేసెను
రోజు నీళ్లు పెట్టెను
పైరంతా పెరిగాక
గడ్డి బాగ యుండెను
189
కూలీలను తెచ్చెను
గడ్డిని కలిపించెను
రైతు చేతపార బట్టి
ఒరము చెక్కు చుండెను
190
గడ్డి యంత నేరెను
ఒక్క దగ్గరేసెను
తాడుతో మోపు గట్టి
ఇంటికి తీసుకెళ్లెను
191
బర్రె ముందు వేశాడు
గడ్డంత మేపాడు
పొద్దుగాల లేసినంక
పాలన్నీ పిండాడు
192
ఎండ వానకు ఉంటాడు
పొలమున పని చేస్తడు
తన కోసమే కాకుండ
ప్రజలకు మేలు కోరుతాడు
193
అలసట లేదంటాడు
పని చేస్తూనె ఉంటాడు
రైతేను మనందరికి
నిజమైన భగవంతుడు


మక్క జొన్న గటుక
194.
మక్క కంకులు తెచ్చాము
గింజలన్నియు వలిశాము
గ్రైండరులోన వేసియు
రవ్వ లాగ చేసినాము
195
నీళ్లు రవ్వల కలిపాను
గిన్నెలో ఉడక పెట్టాను
సల్ల గలిపితిను చుండ
ప్రాణము చల్ల గుండును
196
పూర్వము గట్కతిన్నారు
ఆరోగ్యంగా ఉన్నారు
ఒంటికి జబ్బులు రాకుండ
చాలకాలము బతికారు
197
గటుక తినడము మరిచారు
బలము లేకుండున్నారు
సారములేని యన్నమును
ప్రజలంత తిను చున్నారు.
198
గటుకల ఐరను ఉన్నది
శక్తినిచ్చు చున్నాది
ఇప్పటి జనులంతను
గటుక తింటెను మంచిది.


కందిలిపై మణిపూస లు
199
చీకట్లో వెళ్ళిన
కందిలేను యుండిన
పాము తేళ్ళ నుండియు
ప్రాణానికి రక్షన
200
కందిల వెళ్ళిపోయెను
కరెంట్ బల్బు లొచ్చెను
ఎక్కువ వెలుగు లివ్వగ
కండ్లుగుడ్డి గాయెను
201
గ్యాసు నూనెను పోశారు
వత్తితో వెలిగించారు
కాంతి ఎక్కవరాగ
చదువులన్నో చదివారు.
202
కందిలి అటు కెక్కెను
తుప్పే పట్టి పోయెను
ఇప్పటి తరానికేమొ
తెలియకుండా పోయెను


ఇడ్లీ మణిపూస లు
203
ఇడ్లీ రవ్వను తెస్తారు
గిన్నెల నానబెడతారు
ఇడ్లీ కుక్కర్లేసి
ఉడికి నంకను తీస్తారు
204
పల్లి చట్ని చేస్తారు
అల్లం చట్ని చేస్తారు
ఇడ్లీ కలిపి తినుచుండ
ఇబ్బంది రాదంటారు
205
పొద్దున ఇడ్లితినాలి
ఆరోగ్యంగా ఉండాలి
సులభంగ జీర్ణమౌను
అందరును గ్రహించాలి.


కరోనా మణిపూసలు
206
కరోనా వచ్చింది
భారతుకు చేరింది
అప్రమత్తమవ్వాలని
చాటింపు వేసింది
207.
ప్రధాని మోడి గారు
లాకు డౌను చేశారు
బయటకంత వెళ్ళకుండ
ఇంట్లుండమన్నారు
208
ఊహానులో పుట్టెను
ఊహానులో పెరిగెను
అక్కడి జనులందరిని
అంతము చేయుచుండెను.
209
అన్ని దేశాలెల్తుంది
ఆగమాగము చేస్తుంది
దేశదిమ్మరి లాగ
ప్రజలనంటి తిరుగుతుంది.
210
మందు లేదు మాకు లేదు
అంటుకుంటెను పోలేదు
ఇంట్లోని అందరిని
చంపకుండను పోలేదు
211
ఇంట్లోనే ఉండాలి
రాకుండా చూడాలి
నివారణ ఒక్కటే
మార్గమంటు చెప్పాలి
212
బజార్లెంట తిరుగొద్దు
షేకు హ్యాండు లివ్వొద్దు
మనిషి మనిషికి దూరమం
పాటించుట మరువద్దు
213
దేశమంత తిరుగుతుంది
పల్లె పల్లె తిరుగుతుంది
వాడవాడలు తిరిగియు
మన ఇంటికే వస్తుంది
214
డాక్టర్లె లేకుంటెను
పోలీసు లేకుంటెను
కరోనా కేసులే
కుప్పలై పోయేను
215
సభలెక్కడ పెట్టొద్దు
ప్రజలు గుమిగూడవద్దు
పరిశుభ్రత పాటించి
మన హద్దులు దాటొద్దు.


శ్రీ రాముని కళ్యాణం
216
దశరథుడు రాజుగారు
సంతానము లేని వారు
యజ్ఞాలు చేయ గాను
సంతానము నిచ్చెవారు
217
కొడుకులు నలుగురు బుట్టెను
తొట్టెల వారిని వేసెను
అంగరంగ వైభవంగ
నామకరనణే చేసెను
218
రాముడేను పెద్దవాడు
లక్ష్మణుడు రెండొ వాడు
భరతుడును శత్రుఘ్నుడు
వీరికేను తెలివి మెండు
219
గురువు వద్దకెళ్ళారు
విలువిద్యలు నేర్చారు
రాక్షసులను చంపుటకు
కౌశికునితొ వెళ్లారు
220
తాటకిని చూశారు
బాణ మెక్కుపెట్టారు
చీకటి పడకముందె
నేల కూల్చి వెళ్లారు
221
ఆ కౌశికుని యాగము
కాపాడుటె ధర్మము
అనుచు అన్నదమ్ములు
యోచించిరి మొత్తము
222
మారీచ సుబాహులు
వేసె మాంస ముద్దలు
రామ లక్ష్మణులు చూసి
చంప కురిసే విరులు
223
మిథిల నగర మేగెను
జనకుడు ఏ తెంచెను
కుశల వార్త లడిగియు
ధనువును తెప్పించెను
224
రాముడు చేబూనెను
శివ ధనువును విరిసెను
జనకుడు సీతను తెచ్చి
రాముకుపెళ్లి చేసెను
225
లక్ష్మణుడు ఊర్మిళయును
భరతునికే మాండవిను
శత్రఘ్నునికి శృత కీర్తి
ఇచ్చి పెళ్లిళ్లు జేసెను
226.
అడుగు బయట పెట్టకండి
ఇంటిలోన వుండండి
కరోనా మహమ్మారి
లేకుండానె చూడండి


కూలి తల్లి మణిపూస లు
227.
తట్ట నెత్తిపై పెట్టెను
కొడవలి నడుముకు చెక్కెను
పనిముట్లు ఎత్తుకొని
పొలము పనులకే వెళ్ళెను
228
గడ్డపార పట్టింది
గడ్డలన్ని తవ్వింది
పారచేత బట్టుకొని
తట్ట లెత్తి పోసింది
229
పొలములోనచల్లింది
నీళ్ళు నిండ బెట్టింది
మధ్యాహ్నము కాగానే
సద్ది అన్నము తిన్నది
230
గొడ్డలి చేత పట్టింది
చెట్టుకొమ్మలు నరికింది
తాడు కిందన పరిచియు
కట్టెలమోపు గట్టింది
231
మహిళలంత మంచివారు
పనుల నెన్నో చేశారు
మహిళలార మీకివే
మా యందరి వందనాలు


సీత పర్ణశాల మణి పూసలు
232
మాయలేడి వచ్చెను
ఇంటి చుట్టు తిరిగాను
సీతమ్మ దాన్ని చూసి
కావాలని కోరిను
233
రాముడు వద్దన్నాడు
సీత పట్టే బట్టెను
చివరికిరాముడేమొ
లేడిపట్టుట వెళ్ళెను
234
మాయలేడి చచ్చెను
సీత పేరు పిలిచెను
సీతమ్మ మరిదినేమొ
అడవికి వెళ్ళు మనెను
235
లక్ష్మణు గీత గీశాడు
వదిన దాటకు అన్నాడు
లక్ష్మణుడే రాముడిని
వెతకడానికి వెళ్లాడు
236
లంక నుండియు రావణుడు
పర్ణశాలకు వచ్చాడు
సన్యాసి వేషమేసుక
సీత దగ్గరికొచ్చాడు
237
సీత ఇంట్లో ఉండెను
రావణుడే పిలిచెను
బిక్షాన్ని వేయుమని
అతడు సీత నడిగెను
238
భిక్ష తీసుకొచ్చెను
గీత బయటకెళ్లెను
అప్పుడే రావణుడు
సీత నెత్తు కెళ్ళెను


కమ్మరి వాళ్ళ కష్టాలు
239
వర్షాకాలమొచ్చేను
చెరువులన్నియు నిండెను
నాగలి రైతు తీసుకొని
కమ్మరి దగ్గరికెళ్ళెను
240
బాశడితో చెక్కాడు
నాగలి నే చేశాడు
కర్రు కొలిమిలో కాల్చి
నాగలికే అతికాడు
241
రైతుకు నాగలిచ్చాడు
దాన్ని తీసుక వెళ్ళాడు
ఎడ్లు గట్టి పొలము దున్ని
పంట నందు లో వేసాడు
242
పంటలు బాగ పండెను
లాభాలెన్నో వచ్చెను
కమ్మరికి కూలి కింద
కొంతధాన్య మిచ్చెను
243
ట్రాక్టర్లు చాల వచ్చెను
కమ్మరి పనియే పోయెను
కూలి నాలి చేసుకుంటు
బ్రతుకునే గడుపు చుండెను


చిన్ని కృష్ణుడు మణిపూస లు
244
యశోదమ్మా తనుజుడు
కొంటె పనులు చేశాడు
అల్లరెంతొ చేయును
ఆయనే గోపాలుడు
245
వెన్న దొంగిలిస్తావు
అల్లరెంతొ చేస్తావు
యశోదమ్మ ప్రియమైన
ముద్దుల గోపాలుడవు
246
కొంటె పనులు చేస్తాడు
కొంగులు ముడు లేస్తాడు
వెంటబడి వస్తేను
మాయలు చేస్తుంటావు
247
గోపికలే వచ్చారు
అమ్మ తోటి చెప్పారు
రోలుకేసి బంధించగ
భామలెంతొ మురిశారు
248
కృష్ణుడు మన్నుతినెను
అమ్మ నేమొ చూసెను
నోరు తెరువుమనియనగ
లోకమంత చూపెను.


గంగాళం మణిపూస లు
249
గంగాళము నేడును
కానరాదెక్కడను
పాతబడి మూలకు
చిలుము బట్టి పోయెను
250
డ్రమ్ములెన్నొ వచ్చెను
గంగాలము పోయెను
కంటికి చూద్దామన్న
కానరాక యుండెను
251
బంధువులంత వచ్చెదరు
గచ్చు కాడికి పోయెదరు
చెంబునిండ నీరు దీసి
కాళ్లు చేతులు కడిగెదరు


లహరిమణిపూస లు
252
పెద్దకోడలు వచ్చింది
పిండిని తాను కలిపింది
కొబ్బరి పూర్ణము పెట్టి
అత్తకు అందిఇచ్చింది
253
అత్త నూనెలో కాల్చింది
జల్లి గంటె తీసింది
గరిజలన్ని దేవుచు
పెద్ద గిన్నెలో వేసింది
254
చిన్న కోడలు నిలుచుంది
వారి వంకన చూసింది
భవిష్యత్తులో నేను
ఇలా చేయాలనుకుంది
255
పిల్లలు కూర్చున్నారు
వాటిని చూస్తున్నారు
నాయనమ్మ నేమో
ఇస్తదని చూస్తున్నరు
256.
నాన్నగారు వచ్చారు
అందరు కూర్చున్నారు
నానమ్మ గరిజలను
సమానంగా పంచారు.


ప్రపంచ పటము మణిపూసలు
257
బడులకు సెలవు లిచ్చారు
ఇంటిపట్టున ఉన్నారు
బయటకి వెళ్లి ఆడితె
కరోనా వస్తుందన్నరు
258
పిల్లలు అంత కలిసారు
రంగు డబ్బా తీశారు
గోడకునిచ్చెనేసుకొని
ప్రపంచ పటము గీశారు
259
రంగులనన్ని తెచ్చారు
బ్రష్షు నందులో ముంచారు
బొమ్మకు రంగులు వేసియు
బాలలందరు మురిశారు
మేదరి మణిపూసలు
260
మేదరి యడవికి కెళ్ళాడు
వెళ్తా చెట్లు చూశాడు
వాటినన్నినరికి వేసి
ఇంటికి తీసుకొచ్చాడు
261
ఎండలొ ఎండ పెట్టాడు
మధ్యల కన్నిచీరాడు
సన్న పుల్లలు తీసుకొని
బుట్టల నెన్నొ అల్లాడు
262.
బుట్టలంత రించెను
ప్లాస్టిక్ గంప లొచ్చెను
మేదరి బతుకు కష్టమై
కూలికెళ్ళుచు నుండెను

రోళ్ళు అమ్మేవారిపై మణిపూసలు
263
గుట్ట మీదికి పోయారు
మంచి బండను చూశారు
సుత్తెతో పగులగొట్టి
ఇంటికి తీసుకొచ్చారు
264
ఇంటి బయటకు వచ్చారు
బండనుపగుల కొట్టారు
రోలు,రోకలి చేసుకొని
విసురురాయిని చేశారు.
265
బండ్ల మీద పెట్టారు
వీధులన్ని తిరిగారు
చెమటలన్ని కారంగా
వాటినమ్ముకొచ్చారు
266
రోలు మూలకు పడెను
విసురురాయి పగిలెను
మిక్సీలకు ప్రజలంతా
అలవాటై పోయెను
267
కూలీలకు పని లేక
వేరే పని చేయలేక
ఆగమాయె బతుకులు
సంసారము ఈదలేక.


విస్తర్లపై మణిపూస లు
268
అడవికిమేము వెళ్ళాము
మోదుగు చెట్లను చూసాము
దాని ఆకులు తెంపుకొని
తిరిగి ఇంటికి వచ్చాము
269
దారానికి కుచ్చారు
వాటిని ఎండబెట్టారు
నీళ్లలోన నానబెట్టి
ఆకులు అనగ పెట్టారు
270.
సొప్పపుల్లలు తెచ్చారు
ఇస్తరాకులు కుట్టారు
వేసవి కాలం రాగానే
వాటినిఅమ్మి వేశారు
271
పెళ్లిళ్లు బాగ జరిగెను
విస్తారుకట్ట లమ్మెను
కానీ ఇప్పుడుఅవన్ని
దొరుకుట కష్టము నాయెను
272
ప్లాస్టిక్ ఆకులు వచ్చెను
ఆకు విస్తర్లు పోయెను
ప్రజలందరు వాటికే
అలవాటు చెంది పోయెను


పూస వేర్ల తల్లి మణిపూసలు
273
బస్తీకిని వెళ్తారు
బొమ్మలన్ని తెస్తారు
ఇంటికి వచ్చినంక
గంపలో పేర్చుతారు
274
పొద్దునే లేస్తారు
సామాను సర్దుతారు
గంప నెత్తిన పెట్టుకొని
ఊరంత తిరుగుతారు
275
ఎండలోనమండుతారు
వానలోన తడుస్తారు
చిన్న పాప సంకన
ఎత్తుకొని తిరుగుతారు
276
గంప బరువు మోస్తారు
పాపబరువు అనుకోరు
పొట్ట చేత పట్టుకోని
చాల కష్టపడుతారు
277
ప్రభుత సాయము చేయాలి
వారి కష్టము తీర్చాలి
పేద వారినాదుకొని
ఉపాధిని కల్పించాలి.


సేవలపై మణిపూసలు
278
రోడ్లను సఫాయి వారు 
శుభ్రము చేస్తున్నారు 
మనము బయటకెళ్ళొద్దని 
సేవలు చేస్తున్నారు
279
పోలీసు అన్న లందరు 
బయటే తిరుగుతున్నారు 
ప్రజలు బయట కనిపిస్తే 
లాఠీతొ కొడుతున్నారు
280
వైద్యులింటికొస్త లేరు 
దవఖానల ఉంటున్నరు 
పేషెంట్ల కందరికి 
తగిన సేవ చేస్తున్నారు 
281
కరోన వ్యాధి వచ్చెను 
దేశమంతా తిరిగెను 
ఇంట నుండి బయటకెవరు 
రావద్దనియు చెప్పెను
282
ముసుగు లేకపోతెను 
వ్యాధులన్ని వచ్చును 
మృత్యువుమన వెంటబడి
ప్రాణాలన్ని దీయును


కంసాలి పై మణిపూసలు
283
బంగారము తెస్తారు
కంసాలికి ఇస్తారు 
నగలన్ని చేసి మాకు 
ఇవ్వాలని అంటారు 
284
పొయ్యిని అంటుపెడతారు 
గొట్టముతో ఊదుతారు
నిప్పు ఎర్రగ చేసియు
బంగారము కరిగిస్తరు
285
సుత్తెతోనికొడుతారు
తీగలుగా జేస్తారు 
తీగనంత చుట్టుకుంటు 
పుస్తెలతాడల్లుతరు
286
మంచి కమ్మలు చేస్తారు 
చెవిబుట్టాలు చేస్తారు 
చేతి ఉంగరము చేసి
పట్ట గొలుసులు చేస్తారు
287
మెడలో తాళి చేస్తాడు
మట్టె లన్నీ చేస్తాడు 
పెళ్లి వారి ఇంటికి 
తీసుకునియు వెళతాడు
288
డబ్బులన్ని ఇస్తారు 
లెక్కబెట్టియు చూస్తరు 
కడుపునిండా భుజించి 
తిరిగి ఇంటికొస్తారు.


బాలగణపతి మణిపూసలు
289
అంగను బడికి పోతాను
ఆటలన్ని ఆడుతాను
ఉడకబెట్టిన గుడ్డు
అన్నము లోన తింటాను
290
ఇంటి లోనను ఉండను
బడిలోన ఆడుతాను
బడిఉంటెను మనకు
ఇల్లునే మరిపించును
291
గణపతికాళ్ళుమొక్కాను
కొబ్బరికాయ కొట్టాను
కరోన వెళ్ళిపోగానె
బయట నేను ఆడుతాను.
292
లాకు డౌను పోవాలి
మళ్ళిబడినె తెరువాలి
బడిలోనె అందరము
మంచి చదువులు చదవాలి


అమ్మవారి పూజ మణిపూసలు
293
సోమవారం వచ్చింది
అమ్మ గుడికిని వెళ్ళింది
కొబ్బరికాయ,పూలను
వెంట తీసుక పోయింది.
294
అమ్మవారిని కడిగింది
మంచిగబొట్లు పెట్టింది
పూలదండను వేసి
కొబ్బరికాయ కొట్టింది
295
నైవేద్యమును పెట్టింది
శ్రద్ధ తోడను మొక్కింది
కరోన మహమారిపోయి
అందరు బాగుండాలంది
296
కొబ్బరి వక్కను తీసింది
బిడ్డకు కొంచెము ఇచ్చింది
మిగిలిందిసంచిలేసి
ఇంటికి తీసు కెళ్ళింది

గోపిక పై మణిపూసలు
297
గోపిక వచ్చి కూర్చుంది
కుండలొ పెరుగు పోసింది
అందులో కవ్వమేసి
పెరుగే చిలుకుతుఉన్నది
298
పెరుగులోవెన్న దీసెను
కడవలోనికే ఎత్తెను
ఉట్టి మీద పెట్టగానె
కృష్ణుడే వచ్చిచూసెను
299
గోపిక బయటకు వెళ్లెను
కృష్ణుడు ఇంట్లకు వచ్చెను
వెన్న అందకపోయిన
పీట వేసుకుని తీసెను
300
కృష్ణుడుకొంత తినెను
కొంతపారబోసెను
గోపికమ్మవచ్చి చూసి
యశోదకే చెప్పెను


నేటి బాలలు మణిపూసలు
301
చిన్నపిల్లలు కలిసారు
దుకాణానికి వెళ్లారు
ఒక మీటరు దూరములో
వారు నిలబడి ఉన్నారు
302
బిస్కెట్లకని వెళ్ళారు
దూరమును పాటించారు
పెద్ద వారందరేమొ
గుంపుగా ఉంటున్నారు
303
చిన్న వారిని చూడాలి
మనకు బుద్ధి రావాలి
గుంపులుగ ఉండకుండ
దూరమును పాటించాలి
304
కరోనా తరుమాలి
కలిసికట్టుగుండాలి
ఇంట్ల కాలు బయటకు
పెట్టకుండ చూడాలి
305
రోడ్డు మీదను ఉమ్మొద్దు
అంటురోగము తేవద్దు
అందరికి అంటిచ్చి
ప్రాణములు పోగొట్టుద్దు


రచ్చబండ మణిపూసలు
306
కలిసిమెలిసి ఉంటెను
విడదీయగచూసెను
కొట్లాట పెట్టుకుంటె
చోద్యమంత చూసెను
307
గ్రామ పెద్దలొస్తారు
పంచాయతి చెప్తారు
వారు చెప్పిన తీర్పునే
ప్రజలు పాటిస్తారు
308
పెద్దలందరు కలుస్తారు
రచ్చబండకువెళ్తారు
లొల్లి పెట్టుకున్నను
అందరు కలిసి వెళ్తారు
309
భూముల కొట్లాటలు
ఇంటిలో కొట్లాటలు
పంచాయతి తగవుతీర్చ
పాల్గొందురు పెద్దలు
310
పోలీస్ స్టేషన్ వచ్చెను
రచ్చబండలే పోయెను
ప్రజలు పట్నాలకెళ్ళ
అలవాటయ్యె పోయెను


పేదవారి మణిపూసలు
311
కరోనా వచ్చెను
లాక్ డౌన్ ను చేసెను
ఇంటి బయటకెళ్ళకుండ
ఇంట్లోనే ఉంచేను
312
పేదవారిన పనులను
చేయకుండ చేసెను
అందుకని ధనవంతులు
విరాళాలు ఇచ్చెను
313
ఆస్తులున్న కొందరు
ఆహారం ఇచ్చారు
అందరినీ క్యాంపస్ లో
ఉండమనియు చెప్పారు
314
ధర్మదాతలు మంచి వారు
మంచి మనసుగల్లవారు
కొంతమంది యుండిన
ప్రాణాలు ఆదుకుంటరు


పసుపు బొట్టు మణిపూసలు
315
పండుగలకు ఆడవారు
ఇల్లు ఇల్లు తిరుగుతారు
అందరికీ బొట్టు పెట్టి
ఇంటికిని రమ్మంటారు
316
ఇంటికి వచ్చిన వారు
భోజనమును చేస్తారు
కొందరు తిన్న తర్వాత
కట్న మేసి వెళ్తారు
317
ఇపుడు ఫోన్లు వచ్చెను
బొట్టు పెట్టడం పోయెను
ఫోన్లలోచెప్పగానె
అందరి ఇంటికొచ్చేను
318
ఒకరికొకరు ఊరి నందు
సాయము చేస్తారు ముందు
అందరు కలుసుకుని
పండుగ చేస్తారు విందు
319
ఫోన్లతోనె మంచి జరుగు
ఫోన్ల తోనెచెడు జరుగును
ఎట్లావాడుకుంటెమనకు
అట్లమనకు మేలు జరుగు


వైద్య సేవలు మణిపూసలు
320
పేదవారికి జబ్బులు
డబ్బులు లేక ముప్పులు
ప్రభుత్వాసుపత్రియే
కాపాడును ప్రాణాలు
321
నర్సు లింటికొస్తారు
మందులిచ్చిపోతారు
ప్రతిరోజు ఇంటికొచ్చి
పరీక్షలు చేస్తారు
322
ఇంటి ముందుచెత్త వద్దు
మోరీలల్లో దోమలొద్దు
పరిశుభ్రత పాటించు
చెట్లనన్ని నరకొద్దు
323
మహమ్మారి రోగాలు
పేదవారి తంటాలు
మందులేమొ ఉండబోవు
ఆదమరచిన మరణాలు
324
ధర్మదాతలుంటారు
మందు సాయం చేస్తారు
రోగులకు తగ్గట్టుగ
చికిత్సలు చేస్తారు
325
డాక్టర్లే ప్రాణదాతలు
నిలబెడతారు ప్రాణాలు
దానకర్ణులు లేకుంటె
తిరగబడతయి రోగాలు


సధామునిపై మణిపూసలు
326
కృష్ణుడు బాల్యమిత్రుడు
మంచివాడు సుధాముడు
పేదరికము లోన అతడు
బ్రతుకుతు ఉంటున్నాడు
327
కృష్ణ ఇంటికి సుధాముడు
వెళ్లి వస్త మనుకున్నడు
ధనవంతుడు కృష్ణుడు
వట్టిగ వెళ్ళ అన్నాడు
328
భార్య అటుకులిచ్చెను
దస్తిలోనగట్టెను
దస్తి ముల్లె తీసుకుని
కృష్ణు నింటి వెళ్ళెను
329
చాల మందిని అడిగాడు
కృష్ణుడు ఎక్క డన్నాడు
వారందరిని దాటేసి
కృష్ణుని వద్దకెళ్లాడు
330
కృష్ణుడు కాళ్ళు కడిగెను
పూల దండను వేసెను
విషయాలన్ని తెలుసుకొని
దస్తి ముల్లెను చూసెను
331
అటుకుల ముల్లె విప్పెను
పిడికెడుతానే తినెను
సుధాముని ఇల్లేమొ
బంగారంగ మారెను.

సైనికుని కష్టాలు

332
హిమాలయ పర్వతాలు
భారతదేశ అంచులు
కాపాడుతు ఉంటారు
మా మంచీ సైనికులు
333
ఎంతో కష్టపడతారు 
మనల్ని కాపాడుతారు
భార్యా పిల్లల్ని వదిలి
సరిహద్దుల బతుకుతారు
334
శత్రువు లెందరొ వస్తరు
వారి ధాటికి భయపడరు
ప్రాణాలకు వెరువకుండ
వారే పోరాడుతారు
335
జవాను గోస చెప్పరు
దేశ రక్ష నంటారు
దేశానికి కండ్లలాగ
వాళ్ళు నిలిచిపోతారు

చేతిపంపు మణిపూస లు
చేతిపంపు మణిపూస లు
336
పిల్లనికి దాహమేసెను
నీళ్లు కోసమును చూసెను
కొంతదూరము నందున
చేతిపంపు కనిపించెను
337
బాటిలుకోసమువెతికెను
చూచి తీసుకొని వచ్చెను
హ్యాండిల్ తో బోరుకొట్టి
బాటిల్ నీటితొ కడిగెను
338
బోరింగతడు కొట్టెను
బాటిలునిండ నిండెను
చుక్క నీరుకిందపడక
కడుపునిండ తాగెను 
339
చేతి పంపు పోయెను
నీళ్ళ ట్యాంకు వచ్చెను
రోజుకడుగ కున్నచో
రోగాలెన్నొ వచ్చెను
340 
ఫిల్టరు వాటరొచ్చెను 
కెమికలెక్కువ గడిపెను 
తీయదనం ఎక్కువనగ
చాల మందునె  తాగెను

బుడుగు మణిపూస లు

341
అమ్మ ఉగ్గు పెట్టింది 
తన పనికిని వెళ్ళింది 
ఇంటికొచ్చిన తర్వాత 
పాలను యివ్వ కున్నది 
342
సెల్లులోన పిల్లవాడు
బొమ్మలన్ని చూస్తున్నడు 
అమ్మ సెల్లు తీసుకోగ 
కోపగించి చూసినాడు
343
ఇవ్వుమనియుఅడిగాడు 
అమ్మ ఇవ్వలేదపుడు
పెదవి మడిచి పిడికిలితో
గుద్దుతనని యన్నాడు 
344
అమ్మ నవ్వు నవ్వెను
ఎత్తుకొని ముద్దాడెను 
చిన్నపిల్లలకిప్పుడు 
చాలా తెలివి నుండెను.

పచ్చజొన్న చేను మణిపూసలు

345
ట్రాక్టరును తెప్పించాడు
దుక్కి నంత దున్నినాడు
పచ్చ జొన్న విత్తనాలు
దానిలోన చల్లినారు
346
మొలకలెత్తవట్టెను
నీరు పెట్టు చుండెను
కొంచెం పెద్ద గవ్వగ
మందు లేన్నొ చల్లెను
347
కర్ర పెద్ద గాయెను
కంకి పాలు పోసెను
రైతు కాపలా నుండి
చేను రక్షణ చూసెను
348
పంట బాగ పండెను
కూలీలను తెచ్చెను
కొడవళ్ళు చేతబట్టి
చేనునంత కోసెను
349
కుప్పలన్ని వేసెను
ట్రాక్టరుచేతొక్కెను
బస్తాలన్ని నింపెను
మార్కెటుకే వెళ్ళెను
350
భార్యనే సంతసించెను
కంకి భుజాన పెట్టెను
జొన్నలమ్మినగలను
అమ్మగారికే తెచ్చెను.

సామాజిక దూరం మణిపూసలు

351.
రోడ్డుమీద డబ్బాలను
బాటసారులకుగీసెను
ఇంకొ పక్క రోడ్డేమో
వాహనాలకే వదిలెను
352
ఒక మీటరు దూరములోను
డబ్బాలెన్నోగీసెను
అందులోను బాటసారులు
చక్కగ నిలబడి యుండెను
353
సామాజిక దూరమునను
పాటించాలి అందరును
ఇప్పుడు ఇలా ఉంటను
రేపటికి భవిత ఉండెను
354
మధ్య లేమొ వెళ్లెవారు
పక్కకమొ వచ్చెవారు
దూరమును పాటిస్తే
ఎంత మంచిగా ఉంటారు
355
సామాజిక దూరమును
పాటించకపోయినను
అంటువ్యాధి మనకుతగిలి
జీవితాన్నే చంపును.

బుర్రకథ మణిపూసలు

356
పాత కాలమందునను
రాత్రి వేళలందునను
వీరుల యొక్క గాథలు
బుర్రకథలై వెలిసెను
357
 కథకుడు తంబూర పట్టి
వంతలు డోలకులు కొట్టి
రసవత్తరంబుగాను
కథవింటరు లైనుకట్టి
358
నవ్వు వచ్చే కథలుండును
ఏడ్పు వచ్చె కథలుండును
కథలువిన్న మనలోన
జ్ఞాపకశక్తి పెరుగును
359
బుర్రకథలునేడులేవు
పురాణాలు తెలియలేవు
చెప్పు వారుయున్నను
వినేవారు కరువు నైరి

అనాథలు మణిపూసలు

360.
అమ్మనాన్నలు పోయారు
పిల్లలు ఒంటి అయినారు
తిండి లేక కడుపు మాడి
బిక్కుబిక్కుమంటున్నరు
361
బస్సువెంట పిల్లలు
చేయి చాపి పైసలు
అడుగుతుంటె వారికి
ఇవ్వలేదు పెద్దలు
362
ఆకలెక్కువాయెను
చెత్తకుండి కనబడను
చెత్త లోంచి అన్నము
వేరు చేసుకొని తినెను
363
ఇట్లాంటి పిల్లలను
కనిపెట్టి అందరును
హాస్టల్లో చేర్పించి
చెప్పించు చదువును

అమ్మ  అట్లు మణి పూసలు

364
అమ్మ పిండి తెచ్చింది
గిన్నెలోన పోసింది
మంచిగ నానబెట్టి
అట్లు పోయ చూసింది
365
పొయ్యి అంటు పెట్టింది
పెనము అంత కాలింది
చుయ్ చుయ్ మనికాలగ
అట్ల నెన్నొ పోసింది
366
పిల్లవాడు చూసెను
గిన్నెతీసు కొచ్చెను
అట్లను అందులోన
వేయ ఆరగించెను
367
కడుపునిండ తినెను
కొడుకు నిద్ర పోయెను
ఇంటి పనులు అమ్మయె
హాయిగ చేసుకొనెను

కూలి తల్లి మణి పూసలు

368
పిల్లలతో కలిసెను
కూలిపనికిపోయెను
సాయంత్రం కాగానే
ఇల్లు బయలుదేరాను
369
మార్గమధ్యమందున
వర్షమేమొ కురిసెను
తల్లి పిల్లలు తడువుగా
వర్ష మెలువ కుండెను
370
ధనవంతులు కారులోను
వెళ్ళి పోవుచుండెను
కారులోని వనిత దిగి
గొడుగు విప్పి తెచ్చెను
371
మాతొ మీరు రారండి
కారులోనఎక్కండి
మీ ఇంటి దగ్గరను
మేము దించుతామండి
372
వద్దమ్మ మేము రాము
ఇట్లాగే పోతాము
ఇప్పుడు మీరొస్తేను
తర్వాత ఎట్లు పోతము

పాలతల్లి మణిపూసలు

373
బర్రె పాలు పిండెను
చెంబులలో పోసెను
మరో చెంబు నందున
తోడు వేసి కలిపెను
374
పాలు పెరుగుతెచ్చెను
వాడలన్ని తిరిగెను
పైసలిచ్చి యందరు
కొనుక్కునియు పోయెను
375
వనిత ఇంటికెళ్ళెను
కూర బువ్వ వండెను
పొలము పనులు చేసి వచ్చి
బర్రె గడ్డి వేసెను
376
పాలకేంద్రాలు వచ్చెను
సల్ల పెరుగు కరువాయెను
పాలనమ్మె తల్లు లందరు
కూలి పనులకే చేరెను

మహిళా కష్టాలు మణిపూసలు

377.
ఇంటిలోన అందరు
స్నానాలు చేశారు
వారందరి బట్టలను
స్త్రీలు పిండేస్తారు
378
పిండిన ఆ బట్టలను
ఇస్త్రీ చేసి పెట్టెను
బడికి వెళ్లె పిల్లలకు
ఆ బట్టలను వేయును
379
ఇంట్లో పని చేస్తాది
ఉద్యోగము వెళ్తాది
ఎంత కష్టమైన ఆమె
రెండు పనులు చేస్తాది
380
పాప ఏడుస్తుంటది
అమ్మ పాలను పడుతది
బిగ్గరగా పాపఏడువ
ఉగ్గును తిన పెడుతుంది
381.
మార్కెట్టుకు వెళ్తుంది
కూరగాయ తెస్తుంది
కమ్మని వంటలు చేసి
అందరికిని పెడుతుంది
382
మహిళామణులందరు
అన్నిట్ల ముందుంటరు
పురుషునిలో సగభాగం
ఆడోళ్ళని అంటారు

మూడు గిరకల బండి

383.
మూడు గిరకల బండి
చిన్నపిల్లనే నండి
నడుపుకుంటు వెళ్తుంటె
ముగ్గురే వెనుకండి
384
చిన్ననాటి ఆటలు
తీయని జ్ఞాపకాలు
మనసును ఆనంద పరిచె
మధురమైన ఆటలు
385
ఇప్పుడు ఇవి పోయెను
స్మార్టు ఫోన్లు వచ్చెను
పిల్లలంద రందులోనె
ఆటలాడు చుండెను.
386.
రైలు డబ్బ మాదిరి
పిల్లలాడుచుండిరి
చుక్ చుక్ మని యనుకుంటు
 పిల్లలురుకు చుండిరి.

రైతు కష్టము మణిపూసలు
387.
రైతు కష్టము చేసెను
వరి పంటను వేసెను
వడగండ్ల వానొస్తదని
తొందరపడియుకోసెను
388
వరిపడుగును బెట్టెను
కట్టలన్ని కొట్టెను
తాలువేరుచేసియు
 ధాన్యమెండపోసెను
389.
సంచులల్లోనింపెను
బీటుకు తీసుకెళ్ళెను
ధాన్యమునుఅమ్మివేసి
డబ్బు ఇంటికి తెచ్చెను
390.
శ్రమకు తగ్గ లాభము
రాక పోవుచుండెను
పెట్టుబడులు ఎక్కువై
అప్పు మోపె డాయెను.
391.
రైతులకు ప్రభుత్వము
చేయాలేసాయము
రుణమాఫీ చేసియు
వారల నాదుకొనుము

జన్మదిన మణిపూసలు

392.
చిన్న పాప జన్మదినము
పాపకెంతో సంతసము
అమ్మ,నాన్న అక్క లతో
గుడికి వెళ్ళామందరము
393.
తలంటు స్నానం చేసింది
పట్టు లంగను వేసింది
పొడుగైన జడనల్లి
చక్కగ పూలు పెట్టింది.
394.
చెవుల కమ్మలు పెట్టింది
చేతులకు గాజు లేసింది
కాళ్లకు గజ్జెలు కట్టి
చెంగు చెంగున దూకింది
395
ముఖముకు బొట్టు పట్టింది
మంచిగ తయారయ్యింది
స్నేహితులను పిలుచుకొని
ఘనంగ జరుపుకున్నది
396
కేకు తీసుకువచ్చింది
మధ్యన దాన్ని పెట్టింది
చాకు చేతిలో పట్టుకుని
కేకును కోసి పంచింది.

ఆకు మాస్కు మణిపూసలు

397.
పేదరికమున ఉన్నారు
మాస్కులు కొనలేరు వారు
చెట్ల ఆకులను దెంపి
మూతికి పెట్టుకున్నారు
398
కరోన వస్త దన్నారు
పాపము పేదోళ్ళందరు
ముందు జాగ్రత్త కోసము
ఆకుల మాస్కులు పెట్టారు
399.
డబ్బు లేని పేద వారు
కష్టాలను ఓర్చి వారు
తిప్ప లెన్నొ పడుకుంటు
జీవితాన్ని నెట్టు తారు
400
వలస కూలీల నందరు
ఆదుకోవాలి కొందరు
లాకుడౌను బందువల్ల
పనులువారు చేయలేరు
401.
వలసలంత కలిసిరి
కాలిబాట నడిచిరి
మధ్యలోకి పోగానే
మళ్లి తీసుకొచ్చిరి
402
డేరాలన్ని వేసిరి
ఒక్క చోట నుంచిరి
దాతలొచ్చివారికి
 అన్నము పెట్టి పోయిరి.


ఊరిలోకి కోతులుమణిపూసలు
403.
రోడ్లమీద బండ్లును 
కనిపించక యుండెను 
అందుకని కోతులన్ని
రోడ్లమీద కొచ్చెను 
404.
అడవిలోని చెట్లను
అందరు నరికేసెను
చెట్లు లేక జంతువులు
ఊరి మీద కొచ్చెను 
405
ఆహారము దొరకకను
ఇండ్ల మీద వచ్చెను 
ఇంటిలోని కెగబడియు 
ఎత్తుకొని పోయెను
406.
చెట్ల పెంచరారండి 
కోతులల్ల గొట్టండి 
జంతువులను రక్షించి 
మానవులుగ బతకండి


నాన్న ఆలోచనలు మణిపూసలు
407.
నాన్న మెదడులోనను
చాల విషయముండెను 
బయటకుమాత్రంతాను 
నవ్వుతూనె యుండును
408
తన భార్యా పిల్లలను 
తన యొక్క కుటుంబమును 
మంచి స్థాయిలుంచాలని 
నాన్ననే అనుకొనేను 
409.
ఎంత బాధ అయినను 
కుటుంబ కోసము తను 
కష్టమైన పని చేస్తూ 
పోషిస్తూ ఉండెను


బెస్త వారి మణిపూసలు
410.
వర్షము బాగా కురిసెను 
చెరువులు నిండి పోయేను 
బెస్తవారు చెరువులోన 
చేపలు వేసియు వచ్చెను
411.
పెద్ద పెరుగు చుండెను 
బెస్తవారు పోయెను 
వలలన్ని వేసియు
చేపలన్నిబట్టెను
412.
మార్కెటు తీసుకెళ్లెను
చేపలన్నిఅమ్మెను
అమ్మిన డబ్బులు తీసుక 
ఇంటికితానొచ్చెను.
413.
ఎండకాలము వచ్చెను
చెరువులెండి పోయెను
బెస్త వారికి పనులు లేక
పట్నమెల్లి పోయెను.


కోతులు సామాజిక దూరము
మణిపూసలు
414.
అడవిలోకి వెళ్ళెను
కోతులనేచూసెను
కర్బూజ ఇస్తానని
దగ్గరికే పిలిచెను.
415.
సామాజిక దూరమును 
కోతులేపాటించెను
వరుసగానువచ్చియు
కర్బూజ తీసుకొనెను
416.
కోతులూ దూరమును
పాటిస్తూ ఉండెను 
మానవులు గుంపులుగ 
నిలబడుచూ నుండెను.


రాళ్ళుగొట్టె పిల్లలు
మణిపూసలు
417.
అమ్మ నాన్న లేని వారు
పిల్లలు పని చేస్తున్నరు 
ఆహారము కోసమే 
ఎంతో కృషి చేస్తున్నరు
418.
ప్రభుత్వమే పిల్లలకు 
సహాయ మందించుటకు 
పథకాలను చేబట్ట 
మంచి జరుగు పిల్లలకు
419.
బాలల కష్ట పెట్టొద్దు 
బడికి తోలడమే ముద్దు 
బాల్యాన్ని కాపాడుటే 
పెద్దవారికి మన హద్దు.


 మదర్స్ డే మణిపూసలు
420.
తొమ్మిది నెలలు మోసెను
కడుపునదాచి యుంచెను 
తొమ్మిది నెలల తరువాత 
లోకముకు చూపించెను
421.
చిన్ననాటి నుండి తాను 
ఏ లోటును రాకుండను
ఇడుములునే బడకుండ 
క్షేమముగా నను  పెంచెను
422
అమ్మ పొద్దున లేస్తుంది
వాకిలినూడ్చి వేస్తుంది 
ఇంటిలోని పని నంత
తాను ఒక్కతె చేస్తుంది
423
నాకు జడలను వేస్తుంది 
అన్నమునుతిన పెడుతుంది 
చక్కగా తయారు చేసి
బడికి నన్ను పంపుతుంది
 424.
అమ్మ ఎంతో మంచిది 
మంచి మనసు కలిగినది
ఎంత కష్టమైనతాను
పనులు చేస్తు ఉంటుంది 
425
ఇంట్లో పని చేస్తుంది 
బయట పనికి వెళ్తుంది 
బయట ఎంతో పనిచేస్తు 
డబ్బులింటికి తెస్తది.


గుడిసెపై మణిపూసలు
426
నాన్న మరణించెను 
అమ్మ నొక్కతయ్యెను
పిల్లవాన్ని చూసుకుంటు 
గుడిసెలోన యుండెను
427
గాలివాన వచ్చెను
పరద నెగిరిపోయెను
అమ్మ పిల్లనెత్తుకొని 
గుడిసెలోంచి వెళ్ళెను.
428
పిల్లను సంకన నెత్తుక
నాన్న ఫోటోను పట్టుక
అమ్మ బట్టల మూటను
గట్టి చేతులో పెట్టుక
429
దిక్కు లేకను వెళ్ళను
దీనురాలుగ మారెను
ఎవరు నాదుకుంట రాని
నింగికే చూస్తుండెను
430
ఇండ్లు కూలిన వారికి  
ఇండ్లుయిచ్చెనువీరికి
ప్రభుత్వము నాదుకొనగ
సాయమందెను వీరికి


శివుడు ప్రత్యక్షమగుట
431
రాముడు లంక లోను 
రావణున్నె జంపెను
తిరిగి అయోధ్యా పురికి
సీత తోనె వచ్చెను 
432
రావణున్ని జంపెను
పాప మెట్లుపోవును
అని ఆలోచించుకుంట 
ముక్కంటిని తలచెను
433
రాముని మాటలు విన్నడు 
శివుడు ప్రత్యక్షమైనడు
పాపం పోవాలంటే 
ఒక పని చేయాలన్నాడు 
434
ఇరువదిరెండుబావులను 
తవ్వుమనియే చెప్పెను 
బావిలోని నీరుతో 
స్నానంబు చేయుమనేను
435
బావులు రాముడు తవ్వెను
నీటితో స్నానము చేసెను 
ఇసుకతోని రాముడు 
శివలింగాన్నే చేసెను


 గిరిజన మణిపూసలు
436.
అడవిలోన పుడుతారు 
అందులోనే పెరుగుతారు 
ఇలాంటి వారినంత
గిరిజనులనియంటారు 
437
నీళ్ల కోసమువెళ్ళెను
గుండ్రంగగీసుకొనెను
అందులోన నిలబడి
దూరమునేపాటించెను
438
వరుస క్రమములోనను
నీళ్ళు పట్టుకెళ్ళెను
గిరిజనులందరు గూడ 
కరోనకు భయపడెను
439
తండావాసులందరు
మాస్కులు తెచ్చుకొనెను
పిల్ల పెద్దలనకను
అందరు కట్టుకొనెను
440
పరిసరాలు శుభ్రమాయె 
రోగాలన్ని దూరమాయె
ఆరోగ్యంగగా నందరు
ఉంటే చూసి మురుసుడాయె


బాల రాముని పై మణిపూసలు
441
బాలరాముడు అన్నమును 
తిననని మారాం చేసెను
అమ్మ నేమొ బాలున్ని
వీపు పైన నెత్తుకొనెను
442
బయటకే తీసుకెళ్లెను 
చందమామను చూపించెను 
చూస్తు చూస్తు పిల్లాడు 
కొంచెము అన్నము తినెను
443
ఇంకా యన్నముండెను 
రాము మారాం చేసెను 
చందమామను కిందికి
తెమ్మని యమ్మ నడిగెను
444
అమ్మఆలోచించెను 
పెద్ద అద్దము తెచ్చెను
పైన ఉన్న చందమామ 
అద్దమున కనిపించెను
445
రాముడు సంతోషించెను
అన్నము మొత్తమునుతినెను 
తల్లి సంతోషించగ
కడుపనిండ బువ్వతినెను


 రైతు మణిపూసలు
446
రైతు కష్టపడుతాడు 
పంటలు పండిస్తాడు
వరి కోసి ధాన్యాన్ని 
అమ్మి డబ్బు తెస్తాడు
447
పంటలేను కాకుండను 
కూరగాయ పండించును 
మార్కెటుకు తీసుకెళ్లి 
అమ్మిడబ్బు తెచ్చును
448
పశువులను పెంచుతాడు
గడ్డి వాటికేస్తాడు 
రోజు పాలను పితికి 
పాలకేంద్రము పోస్తడు
449
కోళ్ల నేమొ పెంచుతాడు
వాటికి దాన వేస్తాడు 
బరువు బాగ పెరిగి నంక 
తూక మేసి అమ్ముతాడు 
450
ఆవు పేడ తీస్తాడు 
గోతిలోన వేస్తాడు 
బాగ మురిగిపోయినంక 
బయోగ్యాసు తీస్తాడు.

 

చిన్ని కృష్ణుడు మణిపూస లు
451
యశోద ఆవు పాలను 
పితుకు కుంటను ఉండెను 
అక్కడికొచ్చి కృష్ణుడు 
మా రామెంతొ చేసెను
452
నాకు పాలన్ని కావలెను 
కడుపునిండ తాగుతాను
అమ్మ వీపు వెనకన
మారామే చేస్తుండెను
453
పాలు బిందెలోపోసెను
కృష్ణుడికవియేఇచ్చెను 
మొత్తము పాలు తాగి 
ఖాళి బిందెఅమ్మ కిడెను
454
చిన్ని బాలకృష్ణుడు 
అల్లరెంతొ చేస్తడు 
ఎవరికి దొరకకుండ
మాయలన్ని చేస్తడు 
455.
ముద్దు ముద్దు కృష్ణుడు 
మురళిమోహనాంగుడు
యశోదమ్మ ఇంటి లోన 
చిలిపికొంటె కృష్ణుడు.


వలస కూలీల పాట్లు
మణిపూసలు
456.
వలసెల్లె కూలిని చూడు
తన ఊరు వెళ్తున్నాడు 
తనతో పాటు పిల్లల్ని 
తీసుకువెళ్ళు చున్నాడు 
457.
కర్రకు తాళ్ళను గట్టెను 
కావడి తయారుచేసెను 
కూలికి వెళ్ళే తట్టల
 పిల్లల కూర్చో పెట్టెను
458.
భుజాన కావడెత్తాడు 
పిల్లలను మోస్తున్నాడు 
ఊరు గుర్తుచేసుకుంటు
బాధలు మర్చిపోయాడు 
459.
వృద్ధ తల్లీ దండ్రులను 
శ్రవణ కుమారుడుమోసెను 
వలస కూలీలను చూసిన
ఆ కథనె గుర్తుకొచ్చెను.
460.
బస్సులను నడిపించాలి 
కూలీల ఎక్కించాలి 
వారివారి ఊర్లల్ల
వేగమె దించి రావాలి.

పరమపదసోపానము
మణిపూసలు
461
కైలాసము ఆడుతారు 
అందు గవ్వలు వేస్తారు 
కన్ను,దూగ,తీను,చారు
ఎట్ల పడితె అట్లెళ్తరు
462
అందును పాములుంటాయి 
నిచ్చెనలు కూడుంటాయి
అందును నొక్కొక్క గడికి 
నంబర్లేసి ఉంటాయి 
463
కొందరు పాపము చేస్తరు 
కొందరు పుణ్యము చేస్తరు
పాపము జేస్తెనరకము
పుణ్యమునిచ్చెనెక్కుతరు
464
పెద్దపాముమింగితేను
కోతి దగ్గరకొచ్చును 
పాపం చేయకపోతె 
నిజాయితీగ బతుకును
465 
పాపములను చేస్తెను
నరకానికి పోయెను
పుణ్యం గనుక చేస్తె
స్వర్గానికి పోయేను


ఊరగాయ మణిపూసలు
466
మామిడి కాయలు తెచ్చెను 
వాటిని నానబెట్టేను
మంచిగాను నాని నంక
తీసిఆరను బెట్టేను
467
ముక్కలన్నీకొట్టాము
జీడి తీసియు వేశాము
ముక్కలు తట్టలకెత్తి
పొరుసు తయారు చేశాము
468
పొరుసుని చల్లార్చాము
కొత్త కారము తెచ్చాము 
కారమునకు సరిపడే
ఉప్పుకూడాతెచ్చాము
469
ఉప్పు కారముకలిపాము 
మామిడి వక్కలేశాము
పొరుసు కూడా వేసియు 
మొత్తం తొక్కు కలిపాము
470
మామిడికాయల తొక్కును 
ఎంతో బాగా చేశాను
దాన్ని చూస్తుంటేనే 
నోట్లొ నీళ్ళూరు చుండెను


గిరిజనుల నీటిబాధలు
మణిపూసలు
471.
గిరిజనులు నీరులేకను
బావి దగ్గరికి వెళ్లెను 
అందు లోపలికి దిగియు
నీళ్లు తీసుకొని వచ్చెను 
472.
లోతు చాల గుండెను 
మహిళలంతా దిగెను
పురుషుడిలా మాకు కూడ 
బలముందని చూపెను
473.
బావెంతొలోతు గుండెను 
నీరంత లోపలుండెను 
అయినకూడా మహిళలు 
లోతులోనికి వెళ్ళేను
474.
చెరువులను తవ్వించాలి 
నల్లాలు వేయించాలి 
వారికి అవసరము నైతె 
బోర్లెన్నొ వేయించాలి
475.
ఊరవతల శదిగుడుబావి
నీళ్లన్ని అడుగంటినవి
గిరిజనులకు ఆధారము 
ఊరంతటికి ఆబావి

చిన్న పిల్లల సేవలు
మణిపూసలు
476
కరోన వైరసు వళ్లను 
జనము భయపడు చుండెను 
ధైర్యము చేసి పిల్లలు
సేవకై వారు నిలిచెను
477
చిన్నపిల్లలయినను
మంచి మనసు ఉండెను 
చేతి సంచి నిండవారు
పొట్లాలను దెచ్చెను.
478
వలస కూలీలకు వారు 
చేయి చూపి ఆపి వారు 
రోడ్డు మీద తిరుగుతూ 
ఆహారముఅందించారు
479
వారిలాగా మనము 
సేవలే చేద్దాము
చిన్నపిల్లలంటెనె
దేవునితొ సమానము
480
ప్రేమ గుణము ఉన్నవారు 
సేవలెన్నో చేస్తారు
సమాజమంతవీరిని
గొప్పవాళ్ళుగ చూస్తారు.


పిల్లల ఆటలు మణిపూసలు
481
చిట్ల బొట్ల కాయలు 
చిమ్మ డోని కాయలు 
చిన్న పిల్లలాయిగా
ఆడుకునే ఆటలు
482
పిల్లలందరు కలిసారు 
ఒక్క దగ్గర చేరారు 
ఏంచక్క ఆడదామని
వాళ్లు ఆలోచిస్తున్నరు
483
అగ్గిపెట్టె ఆటలను
ఆడుదాము అందరును
అనుకుంటు కూడుకొని
అందరొచ్చి యాడిరి

484
ఇంతమంచి ఆటలను 
అందరు మర్చిపోయెను
మంచి ఆటలు ఇంకెన్నొ
మరుగున పడిపోయెను
485
ఇప్పుడన్ని పోయెను
స్మార్టు ఫోన్లు వచ్చెను
పిల్లలంత అందులోనె
ఆటలాడు చుండెను

గోధుమ రొట్టె పైమణిపూసలు
486.
రైతు గోధుమవేసెను
పంట బాగా పండెను 
మార్కెట్లో అమ్మగా 
లాభాలెన్నో వచ్చెను
487
అమ్మ సంత కెళ్ళెను 
గోధుమపిండితెచ్చెను
పిండి పిసికి రొట్టెజేసి
పైనముపైన కాల్చెను
488
రోట్టె పైన రైతు బొమ్మ 
కాల్చ గాను వచ్చెనమ్మ
ఏమిటి ఆవింతంటె
 అమ్మ చేతి మహిమనమ్మ
*దివ్యాంగుల పై మణిపూసలు*
489
పాపము దివ్యాంగుడతడు 
టమాటలు అమ్ముతున్నడు 
తల పైన తట్ట పెట్టి
తక్కెడతో వస్తున్నడు

490.
ఊరంతను తిరిగాడు 
టమాటలు అమ్మాడు 
కాళ్ళు నడువరాకయున్న
దిగులుచెందలేదతడు
491.
దివ్యాంగుడు అయినను 
పనులు ఎన్నో చేసెను
కాళ్లు చేతులున్నవారు 
పనులు చేయకుండెను
492
గుండె ధైర్యము వీడు
ఆదర్శంగుంటడు 
అంగవైకల్యముమనకు
అడ్డేమొ కాదంటాడు
493
వికలాంగులార మీరు
బాధపడవలదుమీరు
సమాజము గర్వపడేల 
సాగండి ముందు మీరు

*కొంగు చాటు కొడుకు మణిపూసలు*

494
అమ్మ ఎప్పుడు పిల్లలను 
జాగ్రత్తగ చూసుకొనును
కష్టాలు రాకుండా 
కంటి రెప్పలాఉండును
495
కొత్తవింత చూసినపుడు 
భయము కొంత వేసినపుడు 
అమ్మ చాటు కొంగు దూర 
బెదిరి పోక అదిరిపడడు
496
పిల్లలు పెద్దలై పోగ
పెద్దలే ముసలై పోగ
చిన్ననాటి జ్ఞాపకాలు 
కళ్లముందు కదలాడగ 
497
వృద్ధుల గౌరవించాలి 
పిల్లలుగ భావించాలి 
కడుపునిండ తిండి పెట్టి
వారిని ఆదుకోవాలి 
498
ముప్పుతిప్పలు పెట్టొద్దు
ఆశ్రమాల నుంచొద్దు
మంచిగ సేవలు చేసియు
ఆదుకొనుట మన హద్దు

*గమ్యం చేరుట మణిపూసలు*

499.
ఏది కూడ దరికి రాదు 
దూర దూర మెళ్ళరాదు
లక్ష్య మొకటి పెట్టుకొనియు
గురి నెప్పుడు మరువరాదు
500
మెట్టు మెట్టు నెక్కుచుండు
విజయాలేదగ్గ రుండు 
ఆటంకాలు ఎదురైన 
అధిగమించియు ముందుండు
501
లక్ష్యమన్నది లేకను
ముందుకు సాగుచున్నను 
తెగిన గాలిపటములాగ 
విజయాలు చేజారెను.


పొట్టోల్ల లహరి 
9వ తరగతి
ZPHS గుఱ్ఱాలగొంది